సాధారణంగా ఎవరైనా హీరోయిన్ ను మీకు మీతోటి హీరోయిన్ల లో ఎవరు అంటే ఇష్టం...? అని అడిగితే కాస్త ఇబ్బందిపడతారు. తనకు అందరూ ఇష్టమని, లేదా ఒక్కో విషయంలో ఒక్కొక్కరు ఇష్టమని జవాబును దాటవేస్తారు. కానీ మాజీ పోర్న్ స్టార్ సన్నిలియోన్ మాత్రం తనకు ఎవరు ఇష్టం? అని అడిగితే కుండబద్దలు కొట్టినట్లు ముగ్గురు హీరోయిన్ల పేర్లు టకటకా అని చెప్పేసింది. ఆమె మాట్లాడుతూ... విద్యాబాలన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక కంగనా రనౌత్ ప్రొఫెషనలిజం అంటే చాలా ఇష్టపడతాను. ఇక నాకు ప్రియాంకా చోప్రా ఆదర్శం.. స్పూర్తిగా నిలిచింది.. అంటూ చెప్పేసింది. ఇది విన్న బాలీవుడ్ జనం కత్రినా, దీపికా వంటి వారి పేర్లు లేకుండా ఆమె నిర్మొహమాటంగా విద్యాబాలన్, కంగనా రౌనత్, ప్రియాంకా చోప్రా ల పేర్లు చెప్పడం జీర్ణించుకోలేకపోతున్నారు...!