6టీన్స్, గర్ల్‌ఫ్రెండ్, ప్రేమలో.. పావనీ కళ్యాణ్, జానకీ వెడ్స్ శ్రీరామ్, మహానంది, అధినేత వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో సూపర్‌హిట్ సాంగ్స్ రచించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గేయ రచయిత తైదల బాపు. ఇప్పటివరకు 260కి పైగా చిత్రాల్లో దాదాపు 400 పాటలు రాసిన తైదల బాపు తాజాగా నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ చిత్రంలో ‘టప్పు టప్పం.. పోరి చూస్తే సూపర్ రో’ అంటూ సాగే ఓ మాస్ సాంగ్‌ని రాశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ కావడం, తైదల బాపు రాసిన పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో గేయ రచయితగా బాపు కెరీర్ ఊపందుకుంది. రాబోయే కొన్ని పెద్ద చిత్రాల్లో పాటలు రాసే అవకాశాలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా తైదల బాపు మాట్లాడుతూ ‘‘6 టీన్స్ నుంచి పటాస్ వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సూపర్‌హిట్ పాటలు రాశాను. పటాస్ చిత్రంలో రాసిన మాస్ సాంగ్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దాంతో పెద్ద బేనర్స్‌లో పాటలు రాసే అవకాశాలు వస్తున్నాయి. ఇంతకుముందు చిన్న సినిమాల్లో ఇలాంటి పాటలు రాసినప్పటికీ ఆ సినిమాలకు, ఆ ఆడియోలకు సరైన ప్రమోషన్ లేకపోవడంవల్ల నా పాటలకు ఎలివేషన్ రాలేదు. పెద్ద బేనర్‌లకు, పెద్ద హీరోల సినిమాలకు పాటలు రాయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నాకు నందమూరి కళ్యాణ్‌రామ్‌గారు, దర్శకులు అనిల్ రావిపూడిగారు, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌గారు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. వారి ఎంకరేజ్‌మెంట్‌తోనే మంచి పాట రాయగలిగాను. ‘పటాస్’ చిత్రంలో నేను రాసిన ‘టప్పు టప్పం.. పోరి చూస్తే సూపర్ రో’ అనే పాట నాకు పెద్ద సినిమాల్లో పాటలు రాసే అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఈ పాట క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు లభిస్తున్న ఆదరణకు ఎంతో సంతోషంగా వుంది. ఒక పెద్ద హీరోకి పాట రాస్తున్నాననే కాకుండా నందమూరి అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాట రాశాను. ఈ పాట విన్నవారంతా నన్ను ప్రశంసించడం, నందమూరి అభిమానులు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి అభినందించడం మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తోంది. నా కెరీర్‌లో ఎంతో ఆనందాన్ని కలిగించిన క్షణాలు అవి. ‘పటాస్’ చిత్రంలో నేను రాసిన పాట వల్ల నాకు మంచి బ్రేక్ వచ్చింది. పెద్ద హీరోల సినిమాలకు పాటలు రాసే అవకాశాలు వస్తున్నాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల పాటలు అందించి 2015లో మంచి లిరిసిస్ట్‌గా పేరు తెచ్చుకుంటానన్న నమ్మకం కలుగుతోంది’’ అన్నారు.