Advertisementt

నెంబర్ వన్ మెలోడీ సాంగ్ రిమేక్..!

Fri 23rd Jan 2015 12:14 PM
megastar chiranjeevi,ram charan tej,remake song,thaman  నెంబర్ వన్ మెలోడీ సాంగ్ రిమేక్..!
నెంబర్ వన్ మెలోడీ సాంగ్ రిమేక్..!
Advertisement
Ads by CJ

తన కెరీర్ తొలినాళ్ళ నుండి తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి నటించిన చిత్రాలలోని సూపర్ హిట్  పాటలను ఒక్కొక్కటిగా రీమిక్స్ చేస్తున్నాడు రామ్ చరణ్. కాగా ఆయన త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' చిత్రంలోని 'అబ్బ నీ తీయని దెబ్బ...' అనే పాటను రీమిక్స్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే తన కెరీర్ లో రామ్ చరణ్ 'బంగారు కోడిపెట్ట'...,వానా వానా వెల్లువాయె..., శుభలేఖ రాసుకున్నా..., పాటలను రీమిక్స్ చేసాడు. అయితే 'నాయక్' చిత్రంలోని 'శుభలేఖ రాసుకున్నా ..'పాట పలు విమర్శలకు లోనైంది. పాటను రీమిక్స్ చేసిన విధానం, పాడించిన తీరు కర్ణకఠోరంగా ఉండటంతో ఈ రీమిక్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటను రీమిక్స్ చేసింది కూడా తమనే కావడం గమనార్హం. మరి ఈ తాజా చిత్రంలోనైనా మెలోడీ నెంబర్ వన్ గా పేరొందిన 'అబ్బ నీ తీయని దెబ్బ..' పాటను చెడగొట్టకుండా రీమిక్స్ చేస్తారని భావిద్దాం...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ