'అతనొక్కడే' తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ తన సొంత బేనర్ లో అనిల్ రావిపూడి ని దర్శకునిగా పరిచయం చేస్తూ చేసిన చిత్రం 'పటాస్' మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలకు ముందే యూనిట్ విజయం పై ఎంతో ధీమాగా ఉంది. ఈ చిత్రంలో నటించిన సాయి కుమార్ ఈ చిత్రం విడుదలకు ముందు మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో నటించాను. బాలయ్య బాబుతో ఎన్నో చిత్రాల్లో నటించాను. ముఖ్యంగా ఆయన పోలీస్ పాత్ర చేసిన 'రౌడీ ఇన్ స్పెక్టర్' లో నటించాను. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక కళ్యాణ్ రామ్ తో చేసిన 'పటాస్' చిత్రంలో నటించాను. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుంది. ఈ విధంగా నందమూరి ఫ్యామిలీతో హ్యాట్రిక్ కొడతాను.. అన్న ఆయన నమ్మకాలను 'పటాస్' చిత్రం నిజం చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... అనిల్ రావిపూడి స్టోరీ చెప్పిన వెంటనే కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో చేద్దాం.. నేనే ఈ చిత్రాన్ని నిర్మిస్తాను.. అని చెప్పాడట. కానీ అనిల్ మాత్రం ఈ పాత్ర మీరు చేస్తేనే బాగుంటుందని పట్టుబట్టడంతో ఈ చిత్రం చేశాడట. మొత్తానికి సినిమాకు హిట్ టాక్ రావడంతో యూనిట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని ఒప్పుకోవాలి...!