>బాలీవుడ్ లో 'పీకే' మూవీ తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'షమితాబ్'. ఈ చిత్రం ట్రైలర్స్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్న 'షమితాబ్' పేరే వినిపిస్తోంది. కమల్ హాసన్ చిన్న కూతురు, శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అమితాబ్ బచ్చన్ తో పాటు ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఇళయరాజా ఓ బాలీవుడ్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, పి.సి.శ్రీరామ్ సినిమా టోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 3 వేల ధియేటర్లలో రిలీజ్ అవుతోంది. ధనుష్ కు తమిళనాడులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. గతంలో అమితాబ్ తో 'చిన్నికమ్, పా' చిత్రాలను తీసిన బాల్కీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సాధారణంగా ఒక చిత్రాన్ని ఒక నిర్మాత లేదా ముగ్గురు నలుగురు నిర్మించడం కామన్ అయింది. అయితే ఈ 'షమితాబ్'కు అమితాబ్, ధనుష్, బాల్కీ, ఏక్తా కపూర్ వంటి 16 మంది నిర్మాతలు నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది...!