Advertisementt

ప్రభుత్వమా! సిరివెన్నెలా! ఎవరు చెప్తారు?

Mon 26th Jan 2015 01:10 AM
ap government,sirivennela sitharama sastri,song  ప్రభుత్వమా! సిరివెన్నెలా! ఎవరు చెప్తారు?
ప్రభుత్వమా! సిరివెన్నెలా! ఎవరు చెప్తారు?
Advertisement
Ads by CJ

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలో లేక కేంద్ర ప్రభుత్వమో తాము ప్రతిష్టాత్మకంగా భావించే కార్యక్రమానికి సాహిత్యం, సంగీతం వంటివి అందించమని ఎవరినైనా కోరితే వారు దాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు. కాగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 'విశాఖ ఉత్సవ్' కార్యక్రమానికి ధీమ్ సాంగ్ ను రాయమని స్వయాన మంత్రి గంటా శ్రీనివాసరావు కోరినప్పటికీ ప్రముఖ  గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ అవకాశాన్ని సున్నితంగా తోసిపుచ్చాడని సమాచారం. వివాదరహితుడిగా, అజాత శత్రువుగా పేరున్న సిరివెన్నెల ఈ అవకాశాన్ని ఎందుకు కాదన్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఆయన మనసును నొప్పించే వ్యవహారం ఏదైనా జరిగివుండచ్చని ఫిల్మ్ నగర్ వాసులు అంటున్నారు. మరి అసలు విషయం తెలియాలంటే సిరివెన్నెల కానీ, లేక రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎవరైనా స్పందిస్తే గానీ సమస్య అర్ధం కాదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ