Advertisementt

కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న నాయకుడెవరు..??

Tue 27th Jan 2015 02:06 AM
r krishnaiah,new party,lb nagar mla,tdp party  కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న నాయకుడెవరు..??
కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న నాయకుడెవరు..??
Advertisement
Ads by CJ

చంద్రబాబునాయుడు యూజ్‌ అండ్‌త్రో స్ట్రాటజీకి బలైపోయినట్లుగా బాధపడుతున్న ఆర్‌.కృష్ణయ్య ఇప్పుడు వేరే కుంపటి పెట్టే ఆలోచనలో పడిపోయారు. టీడీపీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యతనివ్వడం లేదని భావించిన కృష్ణయ్య ఒకానొక సమయంలో ఏకంగా రాజకీయాలకే దూరం కానున్నారనే వార్తలు వెలువడ్డాయి. అటు తర్వాత టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో కృష్ణయ్య చేరనున్నారనే వాదనలు కూడా బాగానే వినిపించాయి. అయితే కృష్ణయ్య మాత్రం కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు. బీసీ ఓటర్లను నమ్ముకొని ఆయన కొత్తగా పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి స్వయంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. తనపై కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిళ్లు అధికంగా వస్తున్నాయన్నారు. సుదీర్ఘంగా ఆలోచించి దీనిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇక ఏ పార్టీలో చేరినప్పటికీ తనకు తగినంద ప్రాధాన్యత ఉండదనే ఆర్‌.కృష్ణయ్య కొత్త పార్టీ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ