బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లే అని పవన్ సన్నిహితులు అంటున్నారు. ఇదే విషయాన్నీ ఇటీవల పవన్ ఎదుట శరత్ మరార్ పవన్ తో అన్నప్పుడు పవన్ నవ్వుతూ... నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. త్వరలో షూటింగ్ ప్రారంభిద్దాం అని అన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందనున్న 'గబ్బర్ సింగ్2' చిత్రం వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి లో మొదటి షెడ్యుల్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. పది రోజుల షెడ్యుల్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు వచ్చినట్లు సమాచారం.