అల్లుఅర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'సన్నాఫ్ కృష్ణమూర్తి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్ సీజన్ లో విడుదల కానున్న ఈ చిత్రం తర్వాత బన్నీ ఎవరి దర్శకత్వంలో నటిసున్నాడు? అనే విషయంపై పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. బన్నీ ప్రస్తుతం పలువురు డైరెక్టర్ల స్టోరీలు వింటూ మాట ఇస్తున్నప్పటికీ 'సన్నాఫ్ కృష్ణమూర్తి' తర్వాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే సినిమా చేయనున్నట్లు సమాచారం. ఫ్యామిలి, లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'సన్నాఫ్ కృష్ణమూర్తి' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడమే సరైన చాయిస్ గా ఆయన ఫీలవుతున్నాడట. కాగా ఈ చిత్రాన్ని తమ సొంత గీతా ఆర్ట్స్ బేనర్ పై చేయనున్నట్లు తెలుస్తోంది.