నారా రోహిత్ హీరోగా శ్రీలీలా మూవీస్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పిస్తున్న సినిమా 'శంకర'. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'మౌన గురు' అనే సినిమాకు రిమేక్ ఇది. తెలుగులో ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ను బాలీవుడ్ లో తెరకెక్కించడానికి ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ సిద్దమవడం విశేషం. దక్షినాది చిత్రాలను బాలీవుడ్ లో రిమేక్ చేయడం లో దర్శకుడు మురుగదాస్ సిద్ధహస్తుడు. మురుగుదాసే బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు రెడీ అవడంతో నారా రోహిత్ 'శంకర' ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాలేజ్ యూత్ లో జరిగే గొడవలు, క్రైమ్ ఆధారంగా తమిళంలో దర్శకుడు శాంతకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కడ మంచి హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాను తెరకెక్కించడంలో మురుగదాస్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో వేచిచూడాలి..!