Advertisementt

అనుష్క మంచి మనసు..!

Thu 29th Jan 2015 04:07 AM
anushka,producer,shyam prasad reddy,hyderabad land  అనుష్క మంచి మనసు..!
అనుష్క మంచి మనసు..!
Advertisement
Ads by CJ

గ్లామరస్ పాత్రలలోనూ, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలోనూ నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్కశెట్టి. టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్నా.. చక్కగా ఒదిగి ఉండే లక్షణం అనుష్కది. ఇటువంటి అనుష్క గురించి తాజాగా రెండు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి అరుంధతి కి అనుష్క ని హీరోయిన్ గా ఎంచుకోవద్దని పాత్రకు ఆమె సెట్ కాదని నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డికి కొందరు సూచించారట. కాని సినిమా రిలీజ్ తరువాత తను తప్ప ఆ పాత్రకు వేరెవరు న్యాయం చేయలేరనిపించుకుంది అనుష్క. రెండవది  ఈ సుందరి కి మంచి అభినయంతో పాటు మంచి మనసు కూడా ఉందని తను చేసిన ఒక పనితో రుజువైంది. అదేమిటంటే అనుష్క తన దగ్గర నమ్మకంగా పని చేస్తున్న వారి కోసం హైదరాబాద్ లో ల్యాండ్ కొనుగోలు చేసి వారికి ఇల్లు కూడా కట్టించనుందట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ