Advertisementt

'బందిపోటు' తో 'గడ్డంగ్యాంగ్' పోటీ..!

Fri 30th Jan 2015 04:33 AM
bandipotu,gaddam gang,rajasekhar,allari naresh  'బందిపోటు' తో 'గడ్డంగ్యాంగ్' పోటీ..!
'బందిపోటు' తో 'గడ్డంగ్యాంగ్' పోటీ..!
Advertisement
Ads by CJ

ఫిబ్రవరి 6వ తేదీన అల్లరి నరేష్ సినిమా 'బందిపోటు' విడుదలకానుండగా, రాజశేఖర్ నటించిన 'గడ్డం గ్యాంగ్' కూడా అదే తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ రెండు చిత్రాలకు చాలా కామన్ అంశాలు ఉన్నాయి. ఫ్లాప్స్ లో ఉన్న అల్లరి నరేష్ కు ఈ 'బందిపోటు' చిత్రం చాలా ఇంపార్టెంట్. అదే సమయంలో కెరీర్ చరమాంకంలో ఉన్న రాజశేఖర్ కు కూడా ఇది చాలా కీలకమైన చిత్రంగా మారింది. 'బందిపోటు' చిత్రాన్ని సొంతగా అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ నిర్మిస్తుండగా, 'గడ్డం గ్యాంగ్' చిత్రాన్ని జీవితారాజశేఖర్ నిర్మిస్తోంది. ఈ రెండు చిత్రాలు దొంగతనాల నేపధ్యంలో రూపొందుతుండటం విశేషం. 'బందిపోటు' చిత్రానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, 'గడ్డం గ్యాంగ్' చిత్రానికి సంతోష్ అనే నూతన దర్శకుడు డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే 'బందిపోటు' డైరెక్ట్ ఫిల్మ్ కాగా 'గడ్డం గ్యాంగ్' చిత్రం 'సూదుకవ్వమ్' అనే తమిళ చిత్రానికి రీమేక్ గా రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలలో పైచేయి 'బందిపోటు' దే కావచ్చనే అంచనాలలో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ