టాలీవుడ్, కోలీవుడ్ లలో బాగా బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ పై మోజుతో అక్కడి వెళ్ళింది గోవా బ్యూటీ ఇల్లీబేబి.అయితే ఆమెకు అక్కడ సరైన ఆఫర్స్ లభించడం లేదు. దీంతో ఆమె మరలా దక్షిణాది చిత్రాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన 'జులాయి'. ఇప్పుడదే 'జులాయి' చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది. అసలు విషయం ఏమిటంటే. తెలుగులో 'జులాయి'ని తమిళంలో త్యాగరాజన్ తన స్వీయ దర్శకత్వం లో తన కుమారుడు ప్రశాంత్ హీరోగా తెరకెక్కించనున్నాడు. 'సాహసం' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో నటించేందుకు ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆమె దక్షిణాది చిత్రాలపై కన్నేస్తే మాత్రం ఇప్పుడున్న హీరోయిన్ల కొరతలో ఆమెకు మంచి అవకాశాలే వచ్చే అవకాశం ఉంది.