Advertisementt

'టెంపర్' బిజినెస్ పరిస్థితి ఏంటి..?

Fri 30th Jan 2015 07:35 AM
junior ntr,temper,bandla ganesh,poori jagannadh  'టెంపర్' బిజినెస్ పరిస్థితి ఏంటి..?
'టెంపర్' బిజినెస్ పరిస్థితి ఏంటి..?
Advertisement
Ads by CJ

సినిమా బాగా వచ్చిందని.. అందుకే తాను ఓన్ గా రిలీజ్ చేస్తున్నానని నిర్మాత బండ్లగణేష్ 'టెంపర్' ఆడియో వేడుకలో చెప్పాడు. అయితే ఆయన మాటలు తప్పు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పూరీ ఏ సినిమాని ఎలా తీస్తాడో అర్ధం కాదని, ఆయన్ను నమ్మి సినిమాను కొనలేమని, అదే సమయంలో ఎన్టీఆర్ కూడా ఫ్లాప్స్ లో ఉండటం వల్ల ఆయన పేరు మీద కూడా బిజినెస్ జరిగే పరిస్థితి లేదని, ఇక 'గోవిందుడు అందరివాడేలే' దెబ్బకి గణేష్ పై కూడా నమ్మకం పోయిందని,గతంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం సమయంలో కూడా గణేష్ బిజినెస్ కాకపోవడంతో తానే సొంతగా రిలీజ్ చేస్తానని చెప్పుకున్న విషయాన్ని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇక ఈ ఆడియో వేడుకకు వచ్చిన అతిధి కె.ఎస్.రామారావు వ్యాఖ్యలు కూడా పలు అనుమానాలను కలిగించాయని, 'టెంపర్' షూటింగ్ జరిగే సమయంలో గణేష్ ఎక్కువగా  హైదరాబాద్ లోనే ఉన్నాడని, పూరీ-ఎన్టీఆర్ లు కలిసి సినిమాను పూర్తి చేశారని అర్ధం వచ్చేలా  మాట్లాడటం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని, ఈ చిత్రాన్ని స్వయంగా బండ్లగణేష్, పూరీ, ఎన్టీఆర్ లు కలిసి ఏరియాల వారిగా సొంతంగా రిలీజ్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ