Advertisementt

పూరిజగన్నాథ్ దయాను వదిలిపెట్టడా..?

Sat 31st Jan 2015 02:55 AM
junior ntr,temper,poori jagannath,dayanand  పూరిజగన్నాథ్ దయాను వదిలిపెట్టడా..?
పూరిజగన్నాథ్ దయాను వదిలిపెట్టడా..?
Advertisement
Ads by CJ

పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన సినిమా 'టెంపర్'. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే దయానాయక్ అనే ముంబాయి పోలీస్ ఆఫీసర్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. దయానాయక్ ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. డైరెక్టర్ పూరిజగన్నాథ్ దయా నాయక్ మీద చాలా రీసెర్చ్ చేసారట. పూరిజగన్నాథ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ నేపధ్యంలో ఆల్ రెడీ 'గోలీమార్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ టాక్ ను సంపాదించుకున్నా.. కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ అవలేదనే చెప్పాలి. మరి అదే నేపధ్యంలో తెరకెక్కించిన ఎన్టీఆర్ 'టెంపర్' అయినా పూరి కి వర్కవుట్ అవుతుందేమో చూడాలి. కాజల్ మూడో సారి ఎన్టీఆర్ తో ఈ సినిమాలో జత కట్టనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ