ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాను ఫిబ్రవరి 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అదే రోజున ఒక స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆ హీరో మరెవరో కాదు ఇటీవలే 'రఘువరన్ బిటెక్' సినిమా తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ధనుష్. ఈ సినిమా హిట్ తో తను తమిళంలో చేసే ప్రతి సినిమాను తెలుగులో కూడా అనువదించాలని నిర్ణయం తీసుకున్నాడట. తమిళంలో ధనుష్ నటించిన 'అనేగన్' (తెలుగులో 'అనేకుడు') సినిమా ఫిబ్రవరి 13 న రిలీజ్ చేయనున్నారు. అదే రోజున తెలుగులో కూడా ఆ సినిమాను రిలీజ్ చేయమని ధనుష్ నిర్మాతలని కోరాడట. మరి ఎన్టీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'టెంపర్' సినిమాకు 'అనేగన్' పోటీ ఇవ్వనుందా..?. ఈ విషయం మనకు తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే..!