హీరోయిన్ అంజలి ఇటీవల పబ్ గొడవతో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె పబ్బులో తాగి గొడవ చేసిందని, నానా హంగామా చేసిందంటూ మీడియా లో వార్తలు వచ్చాయి. ఆమె వివరణ ఇచ్చే లోపే ఈ గొడవ సౌతిండియా మొత్తం పాకిపోయింది. తాను త్వరగా వివరణ ఇచ్చి వుంటే ఇలా జరిగేది కాదని ఆమె ఆలోచన. ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తనకు ఖాతా లేకపోవడం వల్లనే తన వివరణ చాలా ఆలస్యంగా జనాల్లోకి వెళ్లిందని భావించిన ఆమె, తాజాగా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసింది. ఇకపై తన గురించి వచ్చే పుకార్లను వెంటనే ఖండించడం, తనకు సంబంధించిన విషయాలు తన అభిమానులతో పంచుకోవడం కోసమే ఆమె ట్విట్టర్ ను వేదికగా ఎంచుకుందని స్పష్టమవుతోంది.