Advertisementt

రేణుకు పవన్ ఇచ్చిన సలహా..!

Wed 04th Feb 2015 07:31 AM
pawan kalyan,renu desai,interview,comments  రేణుకు పవన్ ఇచ్చిన సలహా..!
రేణుకు పవన్ ఇచ్చిన సలహా..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ అతనితో విడిపోయి కొంతకాలంగా పూణేలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తన ఇద్దరు పిల్లల పెంపకం భాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటకే మారాఠిలో ఓ సినిమాను నిర్మించిన రేణు, ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించింది. ఇటీవల ఆమె ఓ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మాజీ భర్త పవన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మేము విడిపోయినప్పటికీ పిల్లల పెంపకంపై ఆ ప్రభావం లేకుండా తల్లితండ్రులుగా మా భాధ్యతలు నిర్వహిస్తున్నాం. పవన్, నేను ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్, దాదాపు ప్రతిరోజు మాట్లాడుకుంటాం. మా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం ఆయనకు తెలుస్తుంది... అని చెప్పుకొచ్చింది. ఇటీవల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఆమెకు ఎదురవుతున్న ఇబ్బందికర మెసేజ్ ల గురించి ఆయనకు కూడా తెలుసు. అలంటి వాటిని పట్టించుకోవద్దు... వాటి గురించి అనవసరంగా ఆలోచించవద్దు.. అని పవన్ సూచించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ