Advertisementt

'టెంపర్' కు ఆర్ధికసాయం చేస్తోంది ఎవరు..?

Thu 05th Feb 2015 02:18 AM
junior ntr,poori jagannath,bandla ganesh,temper  'టెంపర్' కు ఆర్ధికసాయం చేస్తోంది ఎవరు..?
'టెంపర్' కు ఆర్ధికసాయం చేస్తోంది ఎవరు..?
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్-బండ్ల గణేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హైవోల్టేజ్ యాక్షన్ మూవీ 'టెంపర్' ఈ చిత్రం ఫస్ట్ లుక్స్, థియేట్రికల్ ట్రైలర్స్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నెల 13వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సనాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి పి.వి.పి. సంస్థ వారు ఫైనాన్స్ చేస్తున్నట్లు అనధికార సమాచారం. బండ్ల గణేష్ పాత అప్పులు, వడ్డీలని పూర్తిగా మునిగిపోయాడని, ఈ నేపధ్యంలో పి.వి.పి.వారు ముందుకు వచ్చి 10కోట్ల వరకు ఫైనాన్స్ చేసి ఆదుకున్నారని, అందుకు ఎన్టీఆర్ చొరవే కారణం అంటున్నారు. ఆడియో లాంచ్ లో కూడా పి.వి.పి. వారు ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే పివిపి వారు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సాయం చేసారని సమాచారం. అయినా సినిమాలకు ఫైనాన్స్ చేయడం, తీసుకోవడం సినీ సర్కిల్స్ లో సామాన్యమైన విషయమే అని.. ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా అందుకు అతీతమేమీ కాదంటున్నారు. 'టెంపర్' చిత్రం వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దర్శకుడు పూరి జగన్నతే తీసుకున్నాడట. వీటి విలువ రెండు కోట్ల 50లక్షల వరకు ఉంటుందని, తనకు పారితోషికం ఇవ్వలేకపోయిన బండ్ల గణేష్ అందుకు ప్రతిఫలంగా ఈ రైట్స్ ను ఇచ్చాడని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం సినిమాపై నమ్మకంతోనే పూరి ఆ హక్కులు తీసుకున్నాడని వాదిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ