శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో 'ముకుందా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్. వరుణ్ నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా వారిని మెప్పించలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో వరుణ్ 'గమ్యం' , 'వేదం' చిత్రాల డైరెక్టర్ క్రిష్ తో నెక్స్ట్ సినిమా చేయనున్నాని అఫీషియల్ గా చెప్పారు. కానీ 'ముకుందా' సినిమా ఫ్లాప్ టాక్ తో తన రెండవ సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలని ఒక కమర్షియల్ కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారు. 'టెంపర్' తరువాత పూరి దర్శకత్వం వహించే సినిమా ఇదే. పక్కా కమర్షియల్ ఎలెమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాతో అయినా వరుణ్ సక్సెస్ అవుతాడేమో వేచి చూడాల్సిందే ..!