టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ నటించే 'టెంపర్' చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఇలాంటి పెద్ద హీరోల చిత్రాలు విడుదలయ్యేటప్పుడు ఓ వారం, రెండు వారాల దాకా పోటీగా మరో సినిమా కూడా రాదు. అయితే ఈ సారి ఓ చిన్న సినిమా 'టెంపర్'తో పాటు అదే రోజు విడుదలకు ముస్తాబవుతోంది. అదే రామోజీరావు, క్రిష్ ల 'దాగుడు మూత దండాకోర్'. 'టెంపర్'తో పోటీ పడటం ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావంతో తప్పడం లేదని అంటున్నారు. ఇప్పుడు ఈచినెమాను వాయిదా వేస్తే మరో రెండు మూడు నెలలు పాటు విడుదల చేయలేని పరిస్థితులు ఎదురవుతాయని యూనిట్ భావిస్తోంది. అయినా 'టెంపర్' చిత్రం యాక్షన్ మూవీ అని, తమది ఫ్యామిలీ మూవీ కాబట్టి పెద్దగా తమ సినిమాపై ప్రభావం ఉండదని రామోజీరావు భావిస్తున్నారట. మొత్తానికి వారికి వారి సినిమాపై ఉన్న నమ్మకమే ఇంత ధైర్యాన్ని కలిగిస్తోందని అర్ధమవుతోంది.