Advertisementt

ఆ సీఎంను పదవీచితుణ్ని చేయనున్నారా..?

Fri 06th Feb 2015 03:48 AM
nithish kumar,bihar,janatha dal,jithan ram,december elections  ఆ సీఎంను పదవీచితుణ్ని చేయనున్నారా..?
ఆ సీఎంను పదవీచితుణ్ని చేయనున్నారా..?
Advertisement
Ads by CJ

బిహార్‌లో రాజకీయసమీకరణాలు అత్యంత వేగంగా మార్పుచెందుతున్నాయి. ఆ రాష్ట్ర సీఎం పీఠంపై జితన్‌రాంను తొలగించి తిరిగి నితీశ్‌కుమార్‌ను కూర్చోబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మోడీని ఎదుర్కోవాలంటే కలిసి పోరాటం చేయక తప్పదని ఇప్పటికే జనతాపరివార్‌ పేరుతో జనతాదళ్‌(యూ), ఎస్పీ, ఆర్జేడీ తదితర పార్టీలు విలీనానికి కసరత్తులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిసెంబర్‌లో బిహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నితీష్‌కుమార్‌ సీఎం పీఠంపై ఉంటేనే మేలని జనతాపరివార్‌ నాయకులు సూచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు లాలూ ప్రసాద్‌యాదవ్‌, ములాయం సింగ్‌లు నితీష్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కాని అదే సమయంలో సీఎం పీఠంపై నుంచి దిగడానికి జితన్‌రాం ససేమిరా అంటున్నారు. దీంతో ఆయన్ను బలవంతంగా పదవిలోంచి తప్పించడానికి శనివారం జేడీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ నితీష్‌ను తమ నాయకుడిగా ఎంచుకొని జితన్‌రాంను పదవీచితుణ్ని చేయాలని గవర్నర్‌ కోరుతూ తీర్మానం చేయనున్నట్లు తెలిసింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ