మాస్ మహారాజా రవితేజ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న క్రేజీ మూవీ 'కిక్2'లో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా షారుఖ్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన 'చెన్నైఎక్స్ ప్రెస్' చిత్రంలో విలన్ తంగబలి పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ 'కిక్2' చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. కాగా ఇదే చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వేసవి ముగింపు సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.