'టెంపర్' ఆడియో ఫంక్షన్ లో ఈ సినిమా అవుట్ పుట్ అత్యద్భుతంగా, టెర్రిఫిక్ గా వచ్చిందని, తను తన సోదరుడు కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తామని బండ్ల గణేష్ ప్రకటించాడు. దానికి తోడు దర్శకుడు పూరిజగన్నాథ్ కొన్ని ఏరియాల రైట్స్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో డిస్ట్రిబ్యూటర్లలో ఆసక్తి, ఉత్సాహం పెరిగాయి. ఇంత బాగా వచ్చిన చిత్రాన్ని తాము ఎందుకు వాడులుకోవాలనే ఉద్దేశ్యంతో ఒక్కసారిగా ట్రేడ్ లో హడావిడి మొదలై, బండ్ల గణేష్ చేత మొత్తం ఈ చిత్రం ఏరియాలన్నీ ఫాన్సీ రేటుకు అమ్ముడయ్యేలా చేసింది. ఇది చూసిన ఇతర నిర్మాతలు.. మొదట తానే ఉంచుకుంటాను.. అమ్మను అని చెప్పిన బండ్ల గణేష్ మాటలను ఓ బిజినెస్ ట్రిక్ గా చెప్పుకొంటున్నారు. ఈ ట్రిక్ బాగా పనిచేసి డిస్ట్రిబ్యూటర్లను బాగా అట్రాక్ట్ చేసిందని అంటున్నారు. నైజాం సురేష్ ప్రొడక్షన్స్, సీడెడ్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఉత్తరాంధ్ర భారతి పిక్చర్స్, నెల్లూరు ఐకాన్ మూవీస్, కృష్ణా అలంకార్ ప్రసాద్, గుంటూరు ఎస్.క్రియేషన్స్, ఓవర్ సీస్ గ్రేట్ ఇండియా ఫిల్మ్, కర్నాటక బృందా అసోసియేట్స్.. ఇలా అన్నిచోట్లా ఈ చిత్రాన్ని గణేష్ ఫాన్సీరేట్లకు అమ్మేశాడు.