'భాగమతి' చిత్రంలో అనుష్క చేయడంలేదని, ఆమె స్థానంలో అంజలి ఆ పాత్రను చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను 'పిల్ల జమీందార్' ఫేమ్ డైరెక్టర్ అశోక్ ఖండించాడు. తాను ప్రస్తుతం రెండు చిత్రాలకు డైరెక్షన్ చేయనున్నానని, ఈ రెండు చారిత్రక నేపధ్యం ఉన్న చిత్రాలే కావడం విశేషమని ఆయన అన్నారు. 'భాగమతి' చిత్రాన్ని అనుష్కతోనే చేస్తానని, ఇక అంజలితో ప్రస్తుతం 'చిత్రాంగద' చిత్రం చేస్తున్నానని, ఈ రెండింటికి అనేక సారూప్యతలు ఉండటంతో కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ పీరియాడిక్ మూవీస్ కావడం, రెండింటికి తనే దర్శకుడిని కావడంతో ఈ క్లారిటీ ఇస్తున్నానని ఆయన అంటున్నాడు.