ప్రస్తుతం హీరో నాగ చైతన్య 'స్వామిరారా' దర్శకుడు సుదీర్ వర్మతో సినిమా చేస్తున్నాడు. కాగా 'స్వామిరారా' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, నిఖిల్ హీరోగా 'కార్తికేయ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన చందుమొండేటి రెండో చిత్రానికి కూడా నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చందుమొండేటితో నాగచైతన్య చేయనున్న చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో బేనర్ లోనే రూపొందనుందని సమాచారం. మొత్తానికి మొదటి సినిమా హిట్ ఇచ్చిన కుర్ర దర్శకులకు నాగచైతన్య పిలిచి మరీ అవకాశాలు ఇస్తుండటం విశేషం. అందునా తమ తొలి చిత్రాలతో హిట్స్ ఇచ్చిన గురుశిష్యులు ఇద్దరు అంటే సుదీర్ వర్మ, చందుమొండేటి నాగచైతన్యతోనే తమ రెండో చిత్రాలు చేయనుండటం మరో విశేషం.