మహేష్ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'ఆగాడు' చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రానికి 'పటాస్' దర్శకుడు అనిల్ రావిపూడి ఓ రచయితగా వ్యవహరించాడు. 'ఆగాడు' చిత్రం కోసం రూపొందించుకున్న కొన్ని ఎపిసోడ్స్ ను 'పటాస్' కోసం వాడుకున్నారని సమాచారం. అనిల్ రావిపూడి 'ఆగడు' కోసం పది నుండి పదిహేను ట్రాకులను తయారు చేసాడట. అయితే వాటిలో కొన్నే వాడుకున్న శ్రీనువైట్ల కొన్నింటిని తన సినిమాకు వర్కవుట్ కాదని వదిలేశాడట. వాటిల్లో ది బెస్ట్ అనిపించినా వాటిని కొన్నింటిని అనిల్ రావిపూడి 'పటాస్' లో వాడుకున్నాడని, ముఖ్యంగా సినిమాలో బాగా పేలిన 801 ఎపిసోడు 'ఆగడు' కోసం రాసుకుని 'పటాస్'లో వాడుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.