Advertisementt

నితిన్ కు రిలీఫ్ ఇచ్చిన సినిమా..!

Sun 08th Feb 2015 12:26 AM
gowtham menon,ajith,nithin,courier boy movie  నితిన్ కు రిలీఫ్ ఇచ్చిన సినిమా..!
నితిన్ కు రిలీఫ్ ఇచ్చిన సినిమా..!
Advertisement
Ads by CJ

'ఏమాయ చేసావే' సినిమా తో నంది అవార్డు సంపాదించుకున్నా తరువాత ఆ రేంజ్ హిట్ ఇవ్వలేకపోయాడు  డైరెక్టర్ గౌతంమీనన్. దీంతో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు బయ్యర్లలో డిమాండ్ తగ్గిపోయింది. గౌతంమీనన్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ప్రారంభించిన సినిమా 'కొరియర్ బోయ్'. ఈ చిత్ర నిర్మాణం పూర్తయినా ఆర్ధిక కారణాల వల్ల విడుదల కాలేకపోయింది. కాగా రీసెంట్ గా తమిళంలో గౌతం మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన సినిమా 'ఎన్నై ఇరిందాల్'. ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. ఈ సినిమాను తెలుగులో 'ఎంతవాడు కానీ' టైటిల్ తో డబ్ చేయనున్నారు. ఇప్పుడు అజిత్ కొట్టిన హిట్ తో నితిన్ కు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు గౌతం మీనన్ పరిస్థితి మారింది కాబట్టి టాలీవుడ్ బయ్యర్లలో ఖచ్చితంగా నితిన్ 'కొరియర్ బోయ్' సినిమాకు మంచి డిమాండ్ వస్తుందని నితిన్ చాలా ఆనందంగా ఉన్నాడట.

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ