ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎమ్మెస్ నారాయణ మరణంతో టాలీవుడ్ యావత్తు షాక్ కు గురైంది. ఆయన నటిస్తున్న పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరి కొన్నింటిలో ఆయన షూటింగ్ పూర్తయినా డబ్బింగ్ పూర్తి కాలేదు. ఇలా డబ్బింగ్ పూర్తికాని చిత్రాల్లో త్రివిక్రమ్-అల్లుఅర్జున్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' ఒకటి. ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం త్రివిక్రమ్ పలువురు మిమిక్రీ ఆర్టిస్టు, నటుడు శివారెడ్డి ఎమ్మెస్ నారాయణ వాయిస్ ను పర్ఫెక్ట్ గా చూపడంతో త్రివిక్రమ్ శివారెడ్డి ఓకే చేసి అతని చేత డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.