ఎన్టీఆర్, కాజల్ జంటగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తోన్న చిత్రం 'టెంపర్'. పూరిజగన్నాథ్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్స్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకొని ఈ నెల 13న సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సమయంలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ విషయంలో సమస్య వచ్చి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం ఆపేసాడని సోషల్ మీడియా సైట్లలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆయన సన్నిహితులు మాత్రం డబ్బింగ్ పూర్తయిందని, గొంతు సమస్య వల్ల మధ్యలో డబ్బింగ్ కు గ్యాప్ ఇచ్చాడని చెప్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో నిజంగా ప్రాబ్లం ఉంటే కూర్చొని చర్చించుకుంటామని అంతే కాని సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న సమయంలో ఇలాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఎన్టీఆర్ కు లేదని అన్నారు.