మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. రైటర్ బివిఎస్ రవి చిరంజీవి కి స్టొరీ లైన్ వినిపించారు. పరుచూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ 90 శాతం కంప్లీట్ అయింది. కాగా ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయగలరో నిర్ణయం తీసుకొని అఫీషియల్ ఫిబ్రవరి చివరి వారంలో ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నారట. అయితే ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి ఓ మాస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి కావల్సిన విధంగా చిరంజీవి వర్కవుట్స్ చేస్తున్నారని సమాచారం. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.