సినిమా స్టొరీతో సంబంధం లేకుండా వరుసగా 'లెజెండ్, లయన్, డిక్టేటర్'వంటి పవర్ ఫుల్ టైటిల్స్ వైపు మొగ్గు చూపిస్తున్న బాలకృష్ణ 100వ చిత్రంపై ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ను పెట్టనున్నారని, ఈ చిత్రానికి మరోసారి బోయపాటిశ్రీను దర్శకత్వం వహించనున్నాడని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం బాలయ్య తన 98వ చిత్రంగా సత్యదేవా అనే నూతన దర్శకునితో 'లయన్' చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత 99వ చిత్రంగా 'లౌక్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో 'డిక్టేటర్' అనే టైటిల్ తో ఓ ఎంటర్ టైనర్ ను చేయనున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఆయన తన 100 వ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరులో లాంఛనంగా ప్రారంభించనున్నాడని సమాచారం.