మా టెలివిజన్ నెట్ వర్క్ వారు స్టార్ ఇండియా వారితో విలీనం కాబోతున్నామని ఫిబ్రవరి 11వ తేదీన ఓ అనౌన్స్ మెంట్ చేసారు. స్టార్ స్పోర్ట్స్, స్టార్ గోల్డ్, స్టార్ మూవీస్ వంటి ప్రముఖ జాతీయ చానళ్ళన్నీ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నఛానెల్స్ . ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మా అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో 'మా'టివి చైర్మెన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ "తెలుగు మార్కెట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న 'మా' టెలివిజన్ నెట్ వర్క్ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ తో విలీనం అయితే మరింతగా ప్రేక్షకులను మెప్పించగలమని గ్లోబల్ కంపనీ అయిన స్టార్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇంకా 'మా' ఆధ్వర్యంలో ఉన్న 4 ఛానెల్స్ కు సంభందించిన కార్యక్రమాలన్నీ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం" అని తెలిపారు.
'స్టార్ ఇండియా' అసోసియేషన్ చీఫ్ ఎక్సిక్యుటివ్ ఆఫీసర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ "తెలుగు మార్కెట్ లో అతి తక్కువ సమయంలో 'మా' ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. 'మా' మేనేజ్ మెంట్ టీం క్రియేటివిటీ లో, ప్రోగ్రామ్ క్వాలిటీలో ఎంతగానో శ్రమించింది. ప్రస్తుతం ఉన్న ఎంప్లాయిస్ తోనే స్టార్ ఇండియా అధ్వర్యంలో 'మా' అసోసియేషన్ నడుస్తుంది. 'మా' బ్రాండ్ ను మరింత పటిష్టం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు మరియు 'మా' ప్రమోటర్స్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ హాజరయ్యారు.