Advertisementt

సునీల్‌కి ‘మలుపు’ కాదు, ‘మల్లెపూవు’ని ఇస్తున్నారు!

Thu 12th Feb 2015 04:39 AM
sunil,malupu,mallepuvvu,josh,vasu varma  సునీల్‌కి ‘మలుపు’ కాదు, ‘మల్లెపూవు’ని ఇస్తున్నారు!
సునీల్‌కి ‘మలుపు’ కాదు, ‘మల్లెపూవు’ని ఇస్తున్నారు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం హీరోగా సునీల్‌ పరిస్థితి ఏమంత బాగాలేదు. అలాగే అర్థికంగా కూడా సునీల్‌ కమెడియన్‌ నుండి హీరోగా టర్న్‌ తీసుకున్న తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇక డైరెక్టర్‌ వాసువర్మ విషయానికి వస్తే, మంచి టాలెంట్‌ ఉన్నప్పటికీ నాగచైతన్య నటించిన తొలి చిత్రం ‘జోష్‌’ ఫ్లాఫ్‌ కావడంతో మరో అవకాశం లభించడానికి ఇంత టైమ్‌ పట్టింది. దిల్‌రాజు విషయానికి వస్తే ఆయనకు నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఇటీవల విజయాలు తగ్గాయి. మరలా ‘పటాస్‌’తో ఆయన లాభాలు చూస్తున్నాడు. వీరు ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి మొదట ‘మలుపు’ అనే టైటిల్‌ పెట్టాలని భావించారు. ఈ ‘మలుపు’తో తమకి కూడా ‘మలుపు’ తిరుగుతుందని ఊహించారు. కానీ ఇప్పుడు ఆ ‘మలుపు’ని సున్నితంగా ‘మల్లెపూవు’ని చేశారని తెలుస్తుంది. ‘మలుపు’ అనే టైటిల్‌ సందేశాత్మకంగా అనిపించడంతో..ఆ స్థానంలో ‘మల్లెపూవు’ అనే టైటిల్‌ని పెట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు విభిన్నమైన హాస్యం కలగలిసి ఉన్న ఈ చిత్రానికి ‘మలుపు’ కంటే ‘మల్లెపూవు’ శబ్ధమే బావుందనే వార్తలు కూడా అప్పుడే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి కూడా..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ