రవితేజ 'కిక్2' లో విభిన్నంగా కనిపించనున్నాడు. తండ్రి కొడుకులుగా ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. వైవిధ్యం చూపడానికి ఏకంగా ఆయన ఆరు కిలోల బరువు తగ్గిపోయాడు. అయితే ఈ మధ్య పలు ప్రెస్ మీట్లలో కనిపించిన రవితేజ మరీ బక్కగా కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సినిమా పాత్ర కోసమే ఇంతల తగ్గాడని యూనిట్ సభ్యులు హామీ ఇస్తున్నారు. మరి తండ్రి కొడుకులుగా రెండు విభిన్న గెటప్ లలో కనిపించాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు కదా...!