సెన్సేషనల్ స్టోరీలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటాడు. నిజజీవిత నేపధ్యంలో ఆయన 'సర్కార్, రక్త చరిత్ర 2, బెజవాడ, అటాక్స్ ఆప్ 26/11' వంటి అనేక చిత్రాలను తీశాడు. తాజాగా ఆయన మరో రియల్ స్టోరీ నేపధ్యంలో ఓ కల్పిత కధకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునంద పుష్కర్ మృతి ఆధారంగా సినిమా తీసే పనిలో ఆయన ఉన్నాడు. మొదట ఆత్మహత్య అనుకున్నప్పటికీ ఆమెది హత్య అని తేలింది. కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ భార్యగా ఆమె సుపరిచితం. ఇదే కేసుపై వర్మ ప్రస్తుతం స్టడీ చేస్తున్నాడట. ఈ కేసు కోర్టులో ఓ కొలిక్కివచ్చిన వెంటనే తన సినిమాను మొదలుపెడతాడని సమాచారం.