హీరోయిన్ నిత్యామీనన్ హైటు తక్కువే గానీ అందం, అభినయం విషయంలో మాత్రం ఆమె రేంజ్ కాస్త ఎత్తులోనే ఉంటుంది. అమ్మడు కేవలం నటిగా కాకుండా త్వరలోనే దర్శకురాలిగా మరుతోందిట. అయితే అది ఇప్పుడే కాదని, భవిష్యత్తులో అందుకు సంబంధించిన ప్లాన్స్ ఉంటాయని చెబుతుంది. ఆమె మాట్లాడుతూ.. నేను ఎప్పటికైనా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ. ఈజిప్షియన్ సింగర్ జీవిత కధ ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన ఉంది. భవిష్యత్తులో ఇది సాధ్యం అవుతుందేమో? త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెడతాను అంటోంది. అన్నట్లు ఆమె ఇటీవల విడుదలైన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రం షూటింగ్ లో దర్శకత్వంలో వేలు పెట్టిందనే వార్తలు వచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చిత్ర దర్శకుడు అలాంటిదేమీ లేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మరో విషయం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లుఅర్జున్ హీరోగా రూపొందుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె నటించాల్సిన పలు సీన్ల లో ఆమె జోక్యం చేసుకుందిట. కానీ త్రివిక్రమ్ గట్టిగా హెచ్చరించడంతో భయపడి కామ్ అయిపోయిందని తెలుస్తోంది.