సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా.. వెంటనే ఒప్పుకుంటారు. అయితే అదంతా నిజం కాదని మహేష్ సినిమాకు 'నో' చెప్పి ఓ హీరో ప్రూవ్ చేసాడు. మహేష్ బాబు, వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో ప్రకాష్ రాజ్ పోషించిన తండ్రి పాత్ర కోసం ముందుగా నిర్మాత దిల్ రాజు హీరో రాజశేఖర్ ని సంప్రదించినట్లు సమాచారం. దిల్ రాజు కు, ప్రకాష్ రాజు కు ఉన్న విభేదాల కారణంగానే ఆయన రాజశేఖర్ ని నటించమని అడిగారట. మహేష్, వెంకీ లకు తండ్రి పాత్రలో నేను నటించను అని ఖరాఖండిగా చెప్పేశాడట రాజశేఖర్. దీంతో చేసేదేమీలేక దిల్ రాజు కు ఇష్టం లేకపోయినా ప్రకాష్ రాజు నే ఆ పాత్రకు ఓకే చేసారట. అయితే రాజశేఖర్ ఆ పాత్రలో నటించి ఉంటే తనకు మంచి హిట్ తో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలు వచ్చేవి అని టాలీవుడ్ టాక్. తను మహేష్ కి నో చెప్పి తప్పు చేసానని తెలుసుకున్న రాజశేఖర్ ఇప్పుడు ఏ పాత్రలో నటించడానికైన సిద్ధంగా ఉన్నాను అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. మరి ఇప్పుడైనా ఆయనకు మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి..!