వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేశాడు కేసీఆర్. దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా గెలావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోవడంతో కడియంను ఎమ్మెల్సీగానే చట్టసభకు పంపిస్తారని అందరూ ఊహించారు. ఇక దీనికి తగిన విధంగానే ఇప్పుడు కడియంను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లానుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కడియం పోటీచేయనున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, అందునా ఉన్న వారిలో కూడా ఓటు వేసే వారు ఇంకా తక్కువ కావడం ఇప్పుడు శ్రీహరికి ఇబ్బందిగా మారింది. తన ప్రచారాన్ని ఎక్కడినుంచి మొదలుపెట్టాలో కూడా తెలియని అయోమయ స్థితిలో కడియం ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయినా అధినేత ఆశీస్సులు ఉండగా.. కడియం కష్టపడాల్సిన అవసరం లేదేమో..!.