హీరో వరుణ్ సందేశ్ కెరీర్ గడ్డుపరిస్థితుల్లో ఉంది. ఆయనకు తన కెరీర్ లో 'హ్యాపీడేస్, కొత్తబంగారులోకం, వంటి రెండు హిట్స్ మాత్రమే ఉన్నాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే మాత్రం ఆయన చిత్రాలు మొదలవుతున్నాయి... విడుదలవుతున్నాయి... వెంటనే ధియేటర్ల నుండి వాకౌట్ చేస్తున్నాయి. ఆయన నటించిన తాజా చిత్రం 'పడ్డానండి ప్రేమలో మరి' చిత్రం 14న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఈ మధ్య ఎక్కువగా సీరియస్ సినిమాలు చేశాను. అయితే నేడు వినోదాత్మక చిత్రాలే ఆడుతున్నాయి. అందుకే ఇక నుండి నేను అలాంటి ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల్లో మాత్రమే నటించదలుచుకున్నాను... అంటున్నాడు. పాపం... హిట్ ఫార్ములా కనుగొనడానికి వరుణ్ సందేశ్ కు ఇంతకాలం పట్టింది...!