రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ముదిరింది. చివరకు దాయాదుల ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇటు రాజకీయపరంగా రెండు రాష్ట్రాల నాయకులకు వినోదం పంచేది అయినా ప్రజల మధ్య తీవ్ర విద్వేషాలను సృష్టిస్తోంది. ఇక ఎట్టకేలకు మేల్కొన్న ఇరు రాష్ట్రా ముఖ్యమంత్రులు గవర్నర్ నరసింహన్ సమక్షంలో భేటీ అయి చర్చించి ఒక ఒప్పందానికి వచ్చారు. ప్రస్తుతం నాగార్జున సాగర ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల్లోంచి ఇరు రాష్ట్రాలకు చెరో 20 టీఎంసీల చొప్పున వాడుకోవడానికి అంగీకరించారు. అయితే ఇది తాత్కాలిక ఒప్పందమే. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని శాశ్వాత పరిష్కారం చూపకపోతే ప్రజల మధ్య విద్వేషాలు చెలిరేగే అవకాశముంది. ఇక ఇరు రాష్ట్రాల నీటి పారుదలశాఖా మంత్రులు కూడా మంచి దూకుడు ప్రదర్శించే వ్యక్తిత్వం కలిగిన వారే. అయితే శనివారం జరిగిన సమావేశంలో వారిద్దరు సంయమనం పాటించడం కాస్త గమనించదగ్గ విషయం.