అక్కినేని అఖిల్ లాంచింగ్ మూవీలో ఎట్టకేలకు ఎందరినో పరిశీలించి చివరకు బాలీవుడ్ అమ్మాయి సయేషా సైగల్ ను ఎంపిక చేశారు. ఈ జోడీ వెండి తెరపై అద్భుతంగా ఉంటుందని చూసినవారు అంటున్నారు. అయితే ఇంత కష్టపడి ఈ అమ్మాయిని పట్టుకున్న యూనిట్ సభ్యులు మరీ ముఖ్యంగా నాగార్జున అఖిల్ సినిమా పూర్తయ్యేవరకు ఈ అమ్మడు మరే దక్షిణాది సినిమాలోనూ నటించకూడదని కండీషన్ పెట్టాడట. ఎంతో ప్రతిష్టాత్మక చిత్రంలో తొలి చాన్స్ అందునా తన కుమారుడి లాంచింగ్ సినిమా కాబట్టి ఈ మాత్రం ముందుచూపు, ముందు జాగ్రత్త అవసరమే అని అంటున్నారు. నాగచైతన్య తెరంగేట్రం చేసిన 'జోష్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ రాధ కుమార్తె కార్తీకకు కూడా ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో తెలుగు సినిమాలో నటించకూడదని దిల్ రాజు ఆంక్షలు పెట్టినట్లు అప్పుడు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.