టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లో కూడా హర్రర్ కామెడీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల తెలుగులో వచ్చిన 'ప్రేమ కధా చిత్రమ్' సినిమాను సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ హీరోగా తమిళ్ లో గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు 'డార్లింగ్' పేరుతో నిర్మించాయి. భారీ చిత్రాల మధ్య పోటీని తట్టుకున్న ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'డార్లింగ్'కు సీక్వెల్ గా తమిళంలో 'డార్లింగ్ 2' చిత్రం రూపొందనుంది. జాన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం అక్కడ హిట్ అయితే అప్పుడు మనవాళ్ళు దాన్ని రీమేక్ చేయడమో, లేదా డబ్బింగ్ చేయడమో చేస్తారనేది తెలిసిన విషయమే.