సోలో హీరోగా ‘షాడో’ వంటి ఫ్లాప్.. ‘దృశ్యం’ వంటి హిట్ కొట్టిన వెంకటేష్ ఇటు మల్టీస్టారర్ చిత్రాలతో పాటు సోలో హీరోగా కూడా వైవిధ్యమైన చిత్రాలతో ఆచితూచి ముందుకు వెళుతున్నాడు. మల్టీస్టారర్ చిత్రాల విషయానికి వస్తే ‘మసాలా’ వంటి ఫ్లాప్, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల’ వంటి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న వెంకీ, త్వరలో ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాల దర్శకుడు దశరథ్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. వెంకీతో పాటు దశరథ్‌కు కూడా ఫ్యామిలీ చిత్రాల ఆడియన్స్‌లో మంచి పేరు ఉండటంతో ఈ తాజా చిత్రం కూడా అదే కోవలో ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని మార్చిలో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత వెంకీ చేసే చిత్రం ఇదేనని ఫిల్మ్‌నగర్ వర్గాలు కన్‌ఫర్మ్ చేస్తున్నాయి.