Advertisementt

ధనుష్‌కి బాలీవుడ్‌లో ఇంకోకటి!

Mon 16th Feb 2015 01:23 AM
dhanush,raanjhanaa,anand v roy,shamitabh,dhanush 3rd bollywood movie  ధనుష్‌కి బాలీవుడ్‌లో ఇంకోకటి!
ధనుష్‌కి బాలీవుడ్‌లో ఇంకోకటి!
Advertisement
Ads by CJ

కోలీవుడ్‌, బాలీవుడ్‌లతో పాటు టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్‌ తెచ్చుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న తమిళ స్టార్‌ హీరో ధనుష్‌. ఇటీవల వరుస విజయాలతో ధనుష్‌ బిజీ హీరోగా మారిపోయాడు. ఇప్పటికే ఆయన నటించిన బాలీవుడ్‌ మూవీ ‘షమితాబ్‌’ విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఈ నెల 20న ధనుష్‌ నటించిన అనేకుడు (తమిళంలో అనేగన్‌) చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో ‘రాంఝాన’, ‘షమితాబ్‌’ చిత్రాలు చేసిన ధనుష్‌ అక్కడ మూడో చిత్రానికి సైన్‌ చేసినట్లుగా తాజాగా తెలుస్తుంది. ‘రాంఝాన’ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ ధనుష్‌తో మరో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా బాలీవుడ్‌ టాక్‌. ఓ మధురమైన ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. ఈ విషయం తెలిసిన వాళ్ళంతా ధనుష్‌ హవా రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ