దర్శకుడు రవిబాబు చిత్రాలంటే సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో చిత్రవిచిత్రమైన టేకింగ్ తో ఆయన తన చిత్రాలను తెరకెక్కిస్తాడు. కొత్తదనం కోరుకునే వారికీ మరీ ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కు ఆయన చిత్రాలు విపరీతంగా నచ్చుతాయి. ఆయన గతంలో 'అవును' చిత్రం తీసి ప్రశంసలు అందుకున్నాడు. అయితే తెలుగులో సీక్వెల్ హిట్ కావనే సెంటిమెంట్ ఉంది. మరి ఇప్పుడు రవిబాబు 'అవును' చిత్రానికి సీక్వెల్ ను తీశాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 6వ తేదీన విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మరి ఈ చిత్రం ట్రెండ్ ను, సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని, సీక్వెల్స్ హవాను ఈ చిత్రం మొదలయ్యేలా చేస్తుందనే నమ్మకంతో రవిబాబు ఉన్నాడు.