'టెంపర్' విడుదలకు ముందు ఎన్టీఆర్, పూరీజగన్నాధ్, బండ్లగణేష్ లకే కాదు... కాజల్ కు కూడా పరిస్థితులు బాగాలేవు. అయితే ఈ చిత్రం అందరికి అనుకోని అదృష్టాన్ని తీసుకొచ్చి, అందరినీ ఒడ్డున పడేసింది. ఇప్పటికీ 'దయాగాడి దండయాత్ర' బాక్సాఫీస్ ను ఊపేస్తుంది. ఇక ఈ చిత్రం సాధించిన విజయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్న నిర్మాత బండ్లగణేష్ 'టెంపర్' చిత్రానికి పార్ట్ 2 చేస్తానని ప్రకటించాడు. ఈ వార్త నందమూరి అభిమానులకు ఓ తీపి వార్తే. ఇక ఈ చిత్రం జెమినీ చానెల్ కు కూడా అనుకోని బంపర్ఆఫర్ అయింది. ఈ చిత్రంపై షూటింగ్ సమయంలో నెగెటివ్ వార్తలు వస్తున్నప్పటికీ జెమిని చానెల్ ధ్యైరం చేసి ఈ చిత్రం శాటిలైట్ హక్కులను 7 కోట్లకు దక్కించుకుంది. అదే సినిమా విడుదలైన తర్వాత.. అంటే ఇప్పుడైతే ఆ హక్కుల రేటు 10 కోట్లకు పైగానే పలికేవి. దీంతో జెమిని జాక్ పాట్ కొట్టిందని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ గత రెండు మూడు చిత్రాలకు వచ్చిన నష్టాలను ఒక్క 'టెంపర్' చిత్రం తీర్చేస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.