ఇటీవల వరుస ఫ్లాప్ లో ఉండి ఫామ్ కోల్పోయినప్పటికీ మణిరత్నం సినిమాకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితం అయింది. ఆయన ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ లతో 'ఓకే కన్మణి' అనే చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాడు. ఈ చిత్రం దిల్ రాజు సమర్పణలో విడుదల కానుంది. చాలాకాలంగా నిరాశ పరుస్తున్నప్పటికీ.. మణిరత్నం పై నమ్మకం సడలిపోలేదనడానికి ఈ చిత్రం తమిళ్, మలయాళంలో చేస్తున్న బిజినెస్ ఉదాహరణగా చెప్పవచ్చు. మొత్తానికి తెలుగులో 'ఓకే బంగారం' టైటిల్ తో రానున్న ఈ చిత్రం దిల్ రాజు అండతో తెలుగులో ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది..! ఈ చిత్రం ఆడియో రిలీజ్, ప్రమోషన్ కార్యక్రమాలను మార్చిలో ప్రారంభించి ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్, పి. సి. శ్రీరాం వంటి అద్భుత టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.