గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడిపోయిన డైరెక్టర్ పూరీజగన్నాధ్ 'టెంపర్' చిత్రంతో మరలా గర్జించాడు. దీంతో ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొనివుంది. త్వరలో పూరీ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో 'పోకిరి, బిజినెస్ మెన్' చిత్రాలతో వరుసగా రెండు హిట్స్ సాధించిన ఈ జోడీ హ్యాట్రిక్ మూవీగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'దమ్కీ' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ టైటిల్ ను త్వరలోనే ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించనున్నట్లు సమాచారం. ఇప్పటినుండే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండటంతో పూరీ ఈ చిత్రం విషయంలో మరింత ఆచితూచి అడుగులు వేయనున్నాడట.