Advertisementt

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి..!

Thu 19th Feb 2015 01:29 AM
ramanaidu,balakrishna,ntr,ramudu bheemudu  తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి..!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి..!
Advertisement
Ads by CJ

రామానాయుడు గారి మృతిపై స్పందించిన బాలకృష్ణ మాట్లాడుతూ "తెలుగు చిత్ర సీమ గొప్ప నిర్మాతను కోల్పోయింది. తొలి సినిమాని నాన్నగారితో రాముడు-భీముడు నిర్మించిన ఆయన తర్వాత శ్రీ కృష్ణ తులాభారం వంటి ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. అలాగే నేను కూడా ఆయన నిర్మాతగా చేసిన కథానాయకుడు, రాము చిత్రాల్లో నటించాను. ఎన్నో గొప్ప విలువలున్న నిర్మాత. అనేక మంది కొత్త దర్శకులను నటీనటులను, టెక్నీషియన్స్ ను పరిచయడమే కాకుండా భారతీయ భాషలన్నిటిలో చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి. ఈ రోజు ఆయన మనల్ని విడిచిపోవడం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ